రధాని యూరప్ టూర్

23yle4buప్రధాని నరేంద్రమోడీ మరోసారి విదేశాలకు ప్రయాణం అవుతున్నారు. ఎనిమిది రోజులపాటు ఆయన యూరప్, ఉత్తర అమెరికాలో పర్యటించనున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ యూరప్ దేశాల్లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ఇంధనం, భద్రత తదితర రంగాల్లో యూరప్ దేశాల సహకారం కోరనున్నారు. మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో యూరప్ దేశాల పెట్టుబడులను ఆహ్వానించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. 9న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కు చేరుకోనున్న ప్రధాని… ఆ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిజ్ హొలాండేతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. 13న జర్మనీలో ఆ దేశ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో కలిసి ఎకానమిక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు.