రవీంద్రభారతిలో తానా చైతన్య స్రవంతి
హైదరాబాద్: ‘ భాష కోసం మనం.. మనం కోసం భాష’ పేరుతో తానా చైతన్య స్రవంతి 2012 పేరిట రవీంద్రభారతీలో కార్యక్రమం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికార భాష సంఘం అధ్యక్షుడు మండలి బుద్థప్రసాద్, తానా ఛైర్మన్ ప్రసాద్ తోటకూర , అక్కినేని నాగేశ్వరరావు, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరలు హాజరై తెలుగు భాష ఘనమైన చరిత్ర గురించి వివరించారు.