రహదారిని ఆక్రమించారని ఎడ్లబండ్లతో గ్రామస్తుల రాస్తారోకో

కరీంనగర్‌:జూలపల్లి మండలంలోని తేలుకుంట గ్రామాస్థులు రహదారి సౌకర్యం కల్పించాలంటూ ఎడ్లబవడ్లతో ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్‌ 1597గుండా రహదారి ఉండగా ఆ స్థలాన్ని ఆక్రమించారన్నారు. రెవెన్యూ అధికారులు ఇంటిస్థలం మంజూరి చేయటంతో సమస్య తలెత్తిందని వెంటనే పరిష్కరించాని డిమాండ్‌ చేశారు. గంటకుపైగా ఆందోళన కొనసాగింది. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని తాశీల్దారు వెంకటమాధవరావు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.