రహదారుల అభివృద్ధికి సహకరించండి

– కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన తుమ్మల, జితేందర్‌ రెడ్డి
న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ జితేందర్‌ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల విలేకరులతో మాట్లాడారు.. రాష్ట్రంలోని పలు రోడ్ల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తుమ్మల తెలిపారు. సంగారెడ్డి జాతీయ రహదారి 157 కివిూల మంజూరుకు గడ్కరీ ఒప్పుకున్నట్లు మంత్రి తెలిపారు. చౌటుప్పల్‌ -షాద్‌ నగర్‌ – కంది మధ్య 205 కివిూల రహదారిని పరిశీలిస్తామన్నారని తెలిపారు. సీఆర్‌ఎఫ్‌ ఫండ్‌ కింద రూ. 1000 కోట్లు అడిగితే పరిశీలిస్తామన్నారని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ – జడ్చర్ల రహదారిని 4 వరుసలుగా చేసేందుకు అంగీకరించారని తుమ్మల స్పష్టం చేశారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును మర్యాదపూర్వకంగా కలిశామని మంత్రి  తుమ్మల తెలిపారు.