రాంజెఠ్మలానీకి భాజపా షోకాజ్ నోటీసు
ఢిల్లీ: భారతీయ జనతాపార్టీ ఆ పార్టీ సీనియర్ నేత రాంజెఠ్మలానీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయనను పార్టీనుంచి ఎందుకు బహష్కరించకూడదని ప్రశ్నించింది, ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సమావేశమైన పార్టీ పార్లమెంటరీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. శతృఘ్న సిన్హా విషయం కూడా పార్టీ ఆలోచిస్తోంది.