రాంలీల కార్యక్రమానికి మాజీ ఎంపీ లక్ష రూపాయల విరాళం.

: పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.
బెల్లంపల్లి,అక్టోబర్3,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించే రాంలీల కార్యక్రమాని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి లక్ష రూపాయల విరాళం ఇచ్చినట్లు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్ గౌడ్ తెలిపారు. రాంలీల కార్యక్రమాని విరాళాలు అందించాలని బెల్లంపల్లి హిందు ఉత్సవ సమితి ఇచ్చిన పిలుపుకు స్పందించిన మాజీ ఎంపీ విరాళం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈయనతో పాటు బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుడు తోడే వెంకట కృష్ణారెడ్డి అనే యువకుడు ₹ 25 వేల రూపాయల విరాళం హిందు ఉత్సవ సమితికి అందజేసినట్లు ఆయన ఆయన తెలిపారు.