రాకేష్ ఆత్మబలిదానం వృధా కాదు…
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…
రాకేష్ కుటుంబానికి ఉద్యోగ నియామక పత్రాలు…
25 లక్షల చెక్కు అందజేసిన మంత్రి ఎర్రబెల్లి..
ఫోటో రైటప్: చెక్కు అందజేస్తున్న మంత్రి ఎర్రబెల్లి…
2. రాకేష్ చిత్రపటం ముందు నివాళులర్పిస్తున్న మంత్రి ఎమ్మెల్యే…
వరంగల్ బ్యూరో: నర్సంపేట: జూన్ 27
(జనం సాక్షి)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసుల తూటాలకు మృతిచెందిన దామెర రాకేష్ ఆత్మబలిదానం వృధా కానివ్వం అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్ పేట్ గ్రామంలో, దబ్బిర్ పేట గ్రామంలో రాకేశ్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో రాకేశ్ కుటుంబానికి సీఎం కెసిఆర్ ప్రకటించిన 25 లక్షల ఎక్స్ గ్రేషీయా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నియామక పాత్రలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాకేశ్ కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దామెర రాకేష్ ఆత్మబలిదానం వృధా కాకుండా
వెంటనే అగ్నీ పత్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి అని ఏకగ్రీవంగా తీర్మానించారు..
దేశ సేవలో తరించాలి దేశం కోసం దేశభక్తి తో ఆర్మీలో చేరాలనుకున్న రాకేష్
దేశం కోసం అంకితమయ్యాడని ఆయన సేవలను కొనియాడారు.రాకేశ్ ఆత్మ బలిదానం వృథా కాదు అని ప్రతిన పూనారు.సైనికులలో చేరాలనే కాంక్షతో దేశ భక్తి కి స్ఫూర్తిగా నిలిచాడని రాకేష్ ఔనత్యాన్ని పొగిడారు. ఇంత జరిగినా రాకేశ్ కుటుంబాన్ని కేంద్రం ఆదుకోకపోవడం దురదృష్టకరం అన్నారు.
సీఎం కెసిఆర్ మానవతా దృక్పథంతో ఆదుకున్నారు.వాళ్ళ ఇంటిలో ఒకరికి రెవెన్యూ విభాగంలో వారి విద్యార్హత ను బట్టి ఆఫీస్ సబార్డి నేట్ ఉద్యోగం ఇచ్చారని సభలో ప్రకటించారు.
రాకేష్ మీద ఆధారపడిన కుటుంబానికి అండగా ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం
25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించినట్లు వెల్లడించారు. రాకేశ్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చెక్కును అందించినట్లు సభాముఖంగా ప్రకటించారు. మారుమూల పోడు చేసుకుని బతికే గ్రామం నుంచి దేశ రక్షణకు వెళ్ళాలని అనుకున్న రాకేశ్ గొప్ప తనం అందరికీ ఆదర్శం కావాలన్నారు.రాకేశ్ ఆత్మ శాంతించాలంటే వెంటనే అగ్నీ పత్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ తరహాలో దేశ వ్యాప్తంగా చనిపోయిన రైతులను ఆదుకోవాలన
ఆయన అన్నారు. దబ్బిర్ పేట గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్న ఈ గ్రామ అభివృద్ధి నా బాధ్యతగా గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. దబ్బిర్ పేట లో వివిధ అభివృద్ధి పనులకు 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.కేవ్ లా తండా కు 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
దళిత బంధు, ఇండ్లు వంటి ఏ పథకాలు వచ్చినా దబ్బిర్ పేట కు అధిక ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గోపి, ఆర్డీఓ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్, రాకేశ్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments
|