రాఘవపేటలో దళితుల బహిష్కరణ

మల్లాపూర్‌,జనంసాక్షి: మండలంలోని రాఘవపేట గ్రామంలో భూవివాదంలో నెలకొన్న సమస్యను దృష్టలో ఉంచుకుని దళితులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా దళితులకు ఏ విషయంలోనూ సహకరించవద్దని, సహకరించిన వారికి రూ. 5వేలు జరిమానా చెల్లించాలని గ్రామస్థులు తీర్మానం చేశారు. ఈ విషయమై పోలీసులను ఆశ్రయించి న్యాయం కోరనున్నట్లు దళితులు తెలిపారు.