రాజకీయ చైతన్యంతోనే సమాజంలో యాదవుకు గుర్తింపు

భగత్‌నర్‌, న్యూస్‌లైన్‌: రాజకీయ చైతన్యంతోనే సమాజంలో యాదవులకు గుర్తింపు లభిస్తుందని అఖీల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌ కుమార్‌ అన్నరు. నగరంలో ఉజ్వల పార్కు సమీపంలోని సంఘ భవనంలో ఉత్తర తెలంగాణ జిల్లాల జోనల్‌ కార్యవర్గ మావేశం ఆదివారం నిర్వహించారు. కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌అర్బన్‌, వరంగల్‌రూరల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి సంఘబాధ్యులు హాజరయ్యారు. ఆయా జిల్లాల్లో అత్యధిక యాదవ ఓటర్లున్న నియోజకవర్గాలను గుర్తించి రాజకీయ చైతన్య సదస్సు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కరీంనగర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 7న మానకొండూర్‌ , 14న పెద్దపల్లి నియోజకవర్గాల్లో రాజకీయ చైతన్య సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా అశోక్‌ హాజరై మాట్లాడారు.

యాదవులు సంఘటిత శక్తిగా ఎదిగి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడంతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కాగా, జిల్లాకు చెందిన రాష్ట్ర బాధ్యులు పలువురు తమకు సమావేశంపై సమాచారం లేదంటూ ఆందోళన చేశారు.

ఇతర జిల్లాల సమావేశముందన్న సమాచారం ఇచ్చి జిల్లాలో కొందరినే ఆహ్వానించడంపై ప్రశ్నించారు. సమావేశంలో మహాసభ రాష్ట్ర కార్యదర్శి మేకల రాజేందర, జిల్లా అధ్యక్షుడు కాల్వ నర్సయ్యయాదవ్‌, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు కన్నెబోయిన ఓదెలు, రాష్ట్ర కార్యదర్శి నూనె అంజయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శి బాసవేని మల్లేశం యాదవ్‌, నాయకులు జంగ చంద్రన్న, బుచ్చన్న, మంచాల రవీందర్‌, రాజయ్య, పాతకుమార్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, బబ్బూరి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.