*రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు*

నూతన పింఛన్ గుర్తింపు కార్డును పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

మునగాల, సెప్టెంబర్ 27(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అర్హులందరి అందిస్తున్నామని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు  అందుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లతో కలుపుకొని 46 లక్షల మందికి  పెన్షన్ లబ్ది దివ్యాంగులకు నెలకు రూ 3,116లు వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నెలకు రూ 2116ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆసరా పింఛన్ల వల్ల  లబ్ధిదారుల ఆత్మగౌరవం పెరిగిందని ఆయన అన్నారు. కోదాడ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయలకతీతంగా సంక్షేమ పథకాలు వస్తున్నాయని అన్నారు. ఇంకా పలు కారణాల వల్ల పెన్షన్ కార్డులు రాని అర్హత ఉన్న వాటిని పరిశీలన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరు చేపించి కొత్త కార్డులను ఇచ్చే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. అనంతరం  గ్రామంలో ఎమ్మెల్యే నిధులనుండి జరిగిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,  జెడ్పిటిసి నల్లపాటి ప్రమీల శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి కోల ఉపేందర్, స్థానిక సర్పంచ్ వీరమ్మ, మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్, నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు  వెంకట్ రెడ్డి, గన్న నరసింహారావు, నాగరాజు, ఇంద్రారెడ్డి, ప్రదీప్, గొదాటి వెంకటయ్య, వీరయ్య, దస్తగిరి, రంజాన్, టిఆర్ఎస్వి అధ్యక్షులు పాషా తదితరులు పాల్గొన్నారు.