రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు

 కొత్త పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన  ఎమ్మెల్యే పెద్ది,
*మొదటిసారిగా పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులకు నా శుభాకాంక్షలు,
* అర్హత ఉండి పెన్షన్ కార్డులు రానివారు మాన్యువల్ గా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు,
* వారికి కొత్త పెన్షన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరు చేపించే బాధ్యత నాదే,
* ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,
ఖానాపురం సెప్టెంబర్ 19జనం సాక్షి
పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం ఖానాపురం మండలం కేంద్రంము తో పాటు మండలం లో ని పలు గ్రామం లో నూతన గా మంజూరు 3102అయినా కొత్త పెన్షన్ దారుల కు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  పెద్ది మాట్లాడతు మొదటిసారిగా రూ. 2016, 3016 పెన్షన్ కార్డులను అందుకున్న లబ్ధిదారులకు  శుభాకాంక్షలుతేలు పారు. నర్సంపేట నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతాయి అని అన్నారు. ఇంకా పలు కారణాల వల్ల పెన్షన్ కార్డులు రాని అర్హత ఉన్నవారు మళ్లీ మాన్యువల్ గా ఆఫ్ లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవచ్చు అని అన్నారు.
వాటిని పరిశీలన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే మంజూరు చేపించి కొత్త కార్డులను ఇచ్చే బాధ్యత నాదే
 అన్నారు.దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను రద్దు చేయాలని సంక్షేమ పథకాలన్నీ ఉచిత పథకాలని ప్రచారం చేస్తుంది అన్నారు .నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలైటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, రైతుబంధు , రైతు బీమా మరియు 24 గంటల వ్యవసాయ ఉచిత కరెంటు లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేయాలని  కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేయించడం దుర్మార్గమైనటువంటి చర్య అన్నారు.గోదావరి అనుసంధానం పేరుతోపాకాలకు రావాల్సిన గోదావరి నీటిని తమిళనాడుకు తరలించడం ఇక్కడి రైతులకు తీవ్ర అన్యాయం చేయడమే అలాగే రైతులకు ఇస్తున్న ఉచిత కరెంటు తీసివేసి మోటార్లకు మీటర్లు బిగించాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది అని అన్నారు.ఇలా  తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అన్నారు .దేశ ప్రధాని మోదీ దేశ  సంపదను ఆదాని అంబానీలకు దోచిపెడుతూ 12 లక్షల కోట్ల రూపాయలను లూటీ చేసిన కేంద్ర ప్రభుత్వంపై బుద్ధి చెప్పడానికి నర్సంపేట ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామ స్వామి నాయక్,ఎంపీపీ వేముల పెళ్లి ప్రకాష్ రావు,జడ్పీటీసీ బత్తిని స్వప్న శ్రీనివాస్ గౌడ్, ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్  చిరంజీవి హరిబాబు, తెరాస మండల అధ్యక్షుడు మహాలక్ష్మి రాంనర్సయ్య, ఎంపిటిసిలు మర్రి కవిత రామస్వామి, బోడ భారతి పూలు నాయక్,ఉప సర్పంచ్ మేడిద కుమార్,ఎంపీడీఓ సుమనవాణి, పంచాయతీ కార్యదర్శి సుప్రజా, వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.