రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్నవారు..
ఎన్నికల్లో పోటీ ఎలా చేస్తారు
ముషారఫ్‌పై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్, జూన్8(జనం సాక్షి) : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌పై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తీవ్ర నేరమైన రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న ముషారఫ్‌కు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్ ఇవాళ ఇస్లామాబాద్‌లో ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు చట్టం, రాజ్యాంగం అనేవి ఎక్కడున్నాయి. ఆర్టికల్ 6, ముషారఫ్‌పై కేసులు ఏమైపోయాయి?’ అని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ నెల 13న విచారణకు హాజరు కానున్న సందర్భంగా ముషారఫ్‌ను అరెస్టు చేయరాదంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన నవాజ్ షరీఫ్… పాకిస్తాన్‌లో ఎక్కడా చట్టాలు అమలు కావడంలేదని పేర్కొన్నారు. ‘అనారోగ్యంతో బాధపడుతున్న నా భార్యను పరామర్శించి వచ్చేందుకు మూడు రోజులు కూడా మినహాయింపు ఇవ్వలేదు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అక్బర్ బుగ్తి హత్య కేసుతో పాటు మే 12 మారణ¬మం వెనుక కూడా ముషారఫ్ హస్తం ఉందని షరీఫ్ ఆరోపించారు.