రాజీనామాలతో కదలిక రావాలి: చలసాని

విజయవాడ,జూన్‌22(జ‌నం సాక్షి ): ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రత్యేక ¬దా, విభజన హావిూల సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఆయన శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రత్యేక ¬దా కోసం రాజీనామాలు చేయడం హర్షణీయమన్నారు. సంవత్సరం పాటు పదవులను వదులుకోవడం మాములు విషయం కాదని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక ¬దా కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ¬దా కోసం ఎవరు పోరాటం చేసిన వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తుందని చలసాని తెలిపారు. అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే ప్రత్యేక ¬దా సాధ్యమని ఆయన అన్నారు. ¬దా కోసం రాజీనామా చేసిన ఎంపీలపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చలసాని శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలను స్పీకర్‌ గురువారం ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ, అధికార పార్టీ మాత్రం ప్రత్యేక ¬దా విషయంలో తమ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా కాలం గడిపేస్తోంది.