రాజీవ్‌కు ప్రముఖుల ఘన నివాళి

5

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి):

భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి దేశవ్యాప్తంగా పలువురు నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ 71వ జయంతి సందర్భంగా   ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు వీర్‌భూమి వద్ద నివాళు లర్పించారు. పార్లమెంట్‌ హౌస్‌లోని రాజీవ్‌గాంధీ చిత్ర పటం వద్ద కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌లు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అద్వానీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఇదిలావుంటే హైదరాబాద్‌లో రాజీవ్‌కు ఘనంగా నివాళి అర్పించారు. రాజీవ్‌గాంధీ ఆశయాలు యువతకు ఆదర్శమని సిఎల్పీ  నేత జానారెడ్డి అన్నారు. 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్‌దన్నారు. రాజీవ్‌ వేసి పునాదులతోనే లక్షలాదిమందికి ఐటీలో ఉద్యోగాలు వచ్చాయన్నారు. రాజీవ్‌ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులో రక్తదాన శిబిరంలో జానారెడ్డితోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్కలు పాల్గొన్నారు. పంజాగుట్టలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్‌ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.