రాజీవ్ త్రివేదికి ఏపీ ‘సిట్’ నోటీసులు
హైదరాబాద్ ఆగస్ట్20(జనంసాక్షి):
ఫోన్ ట్యాపింగ్ కేసు పై దర్యాప్తు చేస్తున్న ముగ్గురు సభ్యుల సిట్ బృందం గురువారం తెలంగాణ ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదిని సచివాలయంలో కలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా తెలంగాణ ¬ంశాఖ వద్ద ఉన్న కాల్ డేటాను భద్రపరచాలని విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిట్ బృందం ¬ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారుల రాకను నిరసిస్తూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన త్రివేది న్యాయస్థానం పై గౌరవం ఉందని … చట్టపరంగా ముందుకు వెళ్లామన్నారు. మా వద్ద ఉన్న ఆధారాలను అవసరమైనపుడు కోర్టుకు అందిస్తామని స్పష్టం చేశారు.