రాజీవ్ గృహకల్ప లో పోలీసుల అవగాహన సదస్సు

ఘట్కేసర్ నవంబర్ 11 (జనం సాక్షి) ఘట్కేసర్ మండలం రాజీవ్ గృహకల్ప కాలనీలో 7వ వార్డు కౌన్సిలర్ ఆకిటి శైలజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్‌ క్రైమ్స్‌, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్‌ అంశాలపై పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచారం మున్సిపల్ ఆరో వార్డు కౌన్సిలర్ సింగిరెడ్డి సాయి రెడ్డి , 7వ వార్డు కౌన్సిలర్ ఆకిటి శైలజ బాల్ రెడ్డి, 8వ వార్డ్ కౌన్సిలర్ బైరా హిమా ఐలయ్య , 9వ వార్డు కౌన్సిలర్ మెట్టు బాల్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఘట్కేసర్ సి అశోక్ రెడ్డి మాట్లాడుతూ
యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని,
అపరిచిత వ్యక్తులకు సమాచారం ఇవ్వొద్దని,
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి డ్రైవింగ్‌ చేయాలని అవగాహన సదస్సులో చెప్పారు.
అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. సైబర్‌ నేరస్తుల తో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, బ్లూ కలర్‌ లింకులపై క్లిక్‌ చేయవద్దని సూచించారు. ఒక వేళ క్లిక్‌ చేస్తే మీ ఫోన్లో ఉన్న వ్యక్తి గత సమాచారం, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను సైబర్‌ నేరగాళ్లు దోచేస్తారని అన్నారు. నెట్‌ బ్రౌజింగ్‌ సమయంలో వచ్చే నోటిఫికేషన్లపై వెంటనే స్పందించకూడదని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు, కారు గెల్చుకున్నారు అని మెసేజ్‌లు వస్తే స్పందించకూడదని అన్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతులో మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తద్వారా పోయిన డబ్బులు తిరిగి రాబట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
బైక్‌ డ్రైవింగ్‌ చేసేటప్పుడు యువత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. అజాగ్రత్తగా ఓవర్‌ స్పీడ్‌, ఓవర్‌ టేక్‌, రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని కోరారు. ఎక్కడైనా మత్తు పదార్థాల సరఫరా, విక్రయాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందించాలని చెప్పారు. సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలపై జాగ్రత్త వహిస్తూ వారు ఏం చేస్తున్నారో గమనించాలని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ అకిటి బాల్ రెడ్డి మాట్లాడుతూ నీట్ కౌన్సిలింగ్ మొదటి విడతలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సభావత్ అనిత, బద్రు నాయక్ కొడుకు సభావత్ వేణు నాయక్ ను అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధించిన వేణు నాయక్ కు ఎంబీబీఎస్ కు ఉపయోగపడే వస్తువులు కొనుగోలుకు రూ.5 వేలు అందజేశారు. కాలనీ విద్యార్థులు వేణు నాయక్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఘట్కేసర్ ఎస్సై రాములు నాయక్, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.