రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయం లోక్‌సభ, రాజ్యసభలను కుదిపేసింది. సభ నిర్వహణకు సహకరించాలని ఇటీవల ప్రధానమంత్రి విపక్షాలకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ద్విసభలు పార్లమెంటును కుదిపేశాయి. ఎఫ్‌డీఐల విషయంలో ప్రభుత్వం మొండితనాన్ని నిరసిస్తూ సభ సజావుగా సాగకుండా ఆందోళనలు చేపటాయి. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలను నిరసిస్తూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ ఉదయం ఇదే అంశంపై ఒకసారి వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ఎఫ్‌డీఐలపై చర్చ చేపట్టాల్సిందేనని పట్టుబట్టారు. సభ్యులు శాంతించకపోవడంతో చైర్మన్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం సైతం సభ సజావుగా సాగుతుందో లేదో వేచిచూడాల్సిందే.