రాజ్యసభ రేపటికి వాయిదా
ఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది, విపక్షాల ఆందోళనతో సభ సజావుగా సాగే పరిస్థితి కనిపించనందున సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.