రాజ్యసభ రేపటికి వాయిదా

9yprysnn

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. లలిత్ గేట్ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేలపై, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ లపై చర్యలు తీసుకోవాలన్న విపక్షాలు పట్టు వీడలేదు. అటు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, ఇటు సీపీఎం నేత సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ వివరణ ఇవ్వడాన్ని ఇద్దరు నేతలు తప్పుపట్టారు. సుష్మాను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వెనకేసుకొచ్చారు. జైట్లీతో ఆనంద్ శర్మ, సీతారాం ఏచూరికి మధ్య వాగ్వాదం జరిగింది. స్పీకర్ స్థానంలో ఉన్న కురియన్ ఎంత ప్రయత్నించినప్పటికీ సభ అదుపులోకి రాలేదు. దీంతో, సభను మంగళవారం (రేపు) ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు కురియన్ ప్రకటించారు.