రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే చర్యలు:కిశోర్‌చంద్రదేవ్
రాజమండ్రి: అటవిప్రాంతంలో గిరిజన చట్టాలకు విరుద్దంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇప్పందాలు జరుగుతున్నాయని కేంద్ర గిరిజన సంక్షేమమంత్రి కిశోర్ చంద్ర అన్నారు. రంపచోడవరంలో పర్యటనలో భాగంగా ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. షెడ్యూల్డ్ ప్రాంతాలున్న 9రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగితే గవర్నర్‌లు స్పందించాలని కాని 60ఏళ్లలో ఎవరు స్పందించకపోవటం శోచనియమన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే ఏం చర్యలు తీఅసుకోవాలో అవే చర్యలు తీసుకుంటానన్నారు. పంచాయితి ఎన్నికల జాప్యంవల్ల కేంద్రం నుండి రావాల్సిన 1200కోట్ల నిధులు ఆగిపోయాయన్నారు.