రాణి రుద్రమ దేవి మహిళలకు స్ఫూర్తి,మహిళా సాధికారత కు ప్రతీక
:రాష్ట్ర గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్
నల్గొండ జిల్లా లో రాణి రుద్రమ మరణాన్ని తెలిపే చందుపట్ల శిలా శాసనం సందర్శించిన గవర్నర్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి .కాకతీయ సామ్రాజ్యన్ని పరిపాలించిన రాణి రుద్రమ దేవి అత్యంత ధైర్యస్థురాలని,తెలుగు జాతికి గర్వ కారణం,ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తి, ఆదర్శం అని రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సౌందర రాజన్ అన్నారు.మంగళవారం రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సౌందర రాజన్ నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామం సందర్శించారు.చందుపట్ల లో రాణి రుద్రమ దేవి మరణాన్ని తెలిపే చందుపట్ల శాసనం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన ముఖ్యమైన శాసనం ఉంది.చందు పట్ల గ్రామం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.చందు పట్ల రాణి రుద్రమ దేవి విగ్రహం సందర్శించి రాణి రుద్రమ దేవి ఫోటో పై పూల మాల వేశారు. అనంతరం రాణి రుద్రమ మరణాన్ని తెలిపే చందు పట్ల శిలా శాసనం సందర్శించి పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాణి రుద్రమ చరిత్ర ప్రాముఖ్యానికి నోచు కొలేదని,రుద్రమ దేవి చరిత్రను అందరికీ తెలియాల్సిన అవసరముందని అన్నారు.ఇంతటి చరిత్రా త్మక ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతాన్ని స్మారక కేంద్రం నిర్మించి, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని అన్నారు. చందుపట్ల ను సందర్శించి గ్రామస్థులతో మాట్లాడి కాకతీయ పరిపాలకు రాలు రాణి రుద్రమ దేవి కి నివాళులు అర్పించేందుకు వచ్చానని తెలిపారు.గ్రామ ప్రవేశం లో కాకతీయ ప్రాముఖ్యత ను తెలిపేలా స్వాగత ద్వారం నిర్మించాలని గ్రామస్థులు కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డి.అర్. ఓ.జగదీశ్వర్ రెడ్డి,డి.పి.అర్. ఓ శ్రీనివాస్,రాష్ట్ర పురావస్తు, వారసత్వ శాఖ నుండి సహాయ సంచాలకులు బుజ్జి,ఆదిత్య శర్మ,పంచాయతీ రాజ్ ఈ ఈ తిరుపతయ్య,నకిరేకల్ ఎం.పి.డి. ఓ.వెంకటేశ్వర్ రావు,కమిషనర్ బాలాజీ,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు నార్కట్ పల్లి మండలం లోని ఓ సి. టి.ఎల్ అతిథి గృహం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ కు అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,సూర్యాపేట ఎస్.పి.రాజేంద్ర ప్రసాద్, డి.అర్. ఓ.జగదీశ్వర్ రెడ్డి లు స్వాగతం పలికి మొక్కలు అంద చేశారు.