రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

 అక్రమ అరెస్టులతో ప్రజా గొంతుకను అణచివేయలేరు
– ఈడీ కార్యాలయానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్
కుల్కచర్ల, జులై 21(జనం సాక్షి):
రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రాంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని,
అక్రమ అరెస్టులతో ప్రజా గొంతుకను అణచివేయలేరని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయం దగ్గర తలపెట్టిన మౌన దీక్ష నిరసనకు వెళుతున్న కుల్కచర్ల మండల కాంగ్రెస్ నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
తెలంగాణ ప్రదాత అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ  కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని హెచ్చరించారు.మౌన దీక్షకు బయలుదేరుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం సరి కాదని,కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులను ఆపాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నాయకులపై ఎన్ని ఈడీ కేసుల విచారణ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడదని, రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంజీలయ్య గౌడ్,మైనార్టీ మండల అధ్యక్షులు జలీల్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రాంచందర్ నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు దగ్గుల కృష్ణయ్య, మండల మాజీ అధ్యక్షులు పెంటమీది వెంకటయ్య గౌడ్, స్థానిక ఎంపీటీసీ ఆనందం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రయ్య,ఇప్పాయిపల్లి సర్పంచ్ బాల్ రెడ్డి,స్థానిక వార్డు సభ్యుడు మోత్కూరు వెంకటేష్, ముజాహిద్పూర్ యువజన విభాగం అధ్యక్షులు సోమలింగం, వేముల రాములు, విజయ్ కుమార్, కుల్కచర్ల బూతు ఎన్ రోలర్స్ నాగని ఆంజనేయులు, మోత్కూరు వెంకటేష్,ఐలగారి  కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Attachments area