రానున్న కాలం నానో టెక్నాలజీదే

 

హైదరాబాద్‌: రానున్న కాలం నానో టెక్నాలజీదేనని, నానో సాంకేతికతను విద్యార్థులు, శాస్త్రవేత్తలు అందిపుచ్చుకోవాలని కలాం పిలుపునిచ్చారు. సమైక్యతతో పనిచేసిన వారు విజయాన్ని తప్పక సాధిస్తారని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం అన్నారు. ఆశయాలను వాస్తవంలోకి తెచ్చుకోవటం, ఆలోచించి సత్వర నిర్ణయాలు తీసుకోవటం, పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవటం ఏ రంగంలోనైనా విజేతలుగా నిలబెడతాయని కలాం ఉద్బోధించారు. హైదరాబాద్‌లో మిధాని వ్యవస్థాపకుడు డాక్టర్‌ బ్రహ్మ ప్రకాశ్‌ శతజయంతి కార్యక్రమంలో అబ్దుల్‌ కలాం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శాస్త్రవేత్తగా దూరదృష్టితో బ్రహ్మప్రకాశ్‌ తీసుకున్న నిర్ణయాలు అంతరిక్ష రంగంలో భారత్‌ను అభివృద్దిపథంలో నడిపిస్తున్నాయని కలాం కొనియాడారు.