రానున్న నాలుగురోజుల్లో మోస్తరు వర్షాలు
వెల్లడిరచిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
సిద్దిపేటలో భారీ వర్షంతో పొంగిన వాగులు
శ్రీరాంసాగర్, ఎల్లంపల్లికి వరదనీటి రాక
హైదరాబాద్,ఆగస్ట్23(జనంసాక్షి): రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు సిద్దిపేట, యాదాద్రి`భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మంగళవారం మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వివరించింది.
ఇకపోతే సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో వర్షం ముంచెత్తింది. మండలంలోని బస్వాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో బస్వాపూర్‌లోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో సిద్దిపేట`హనుమకొండ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి. ఉదయం నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో వర్షాలకు వాగులు పొంగాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 24,850 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరడంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి 18,720 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 7500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.8 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటనిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.12 టీఎంసీలుగా ఉంది. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగు తుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఎª`లో 14032 క్యూసెక్కులు, అవుట్ ఎª`లో 14032 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తి సామర్థ్యం 20.175 టిఎంసి లు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 19.3419 టిఎంసి లుగా నమోదయ్యింది. కొమురంభీం ప్రాజెక్టు నుంచి అధికారులు ఒక గేటును ఎత్తివేసి 1161 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఎª`లో 816 క్యూసెక్కులుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 విూటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 241.550 విూటర్లు ఉంది.