రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను -డిసిసి అధ్యక్షుడు దొమ్మేటి స్పష్టీకరణ

కాకినాడ, జూలై 13,(: రాబోయే ఎన్నికల్లో తాను శాసన సభ్యునిగా ఎక్కడా పోటీ చేయనని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఆయన న్యూస్‌విజన్‌ ప్రతినిధితో మాట్లాడుతూ తాను జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు ప్రత్యేక కృషి చేస్తున్నానని ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో నెలకొకమారు డిసిసి సమావేశం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 60 మండలాల్లో విస్తృత పర్యటన చేసి కమిటీలు లేని చోట కొత్త కమిటీలు వేయడానికి కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కృషి చేస్తానని చెప్పారు. నామినేటెడ్‌ పదవులు ఇస్తే తీసుకుంటానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.