రామకోటయ్యపై పార్టీలో చర్చించి చర్చలు: వర్ల
హైదరాబాద్: పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న చెన్నం రామకోటయ్యపై పార్టీలో చర్చించి, చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఆయనతో పాటు బాలనాగిరెడ్డి, హరీశ్వర్‌రెడ్డి వంటి మరికొందరు నేతలు కూడా కేవలం సాంకేతికంగానే తమ పార్టీలో ఉన్నారని వర్ల రామయ్య అన్నారు. అసమర్థ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రణబ్‌కు, మతతత్వ భాజపా మద్దతిస్తున్న సంగ్మాకు దూరంగా ఉండాలనే రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉంటున్నట్లు వర్ల రామయ్య స్పష్టంచేశారు.