రామగుండంలో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా రామగుండంలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44, తిరుపతి 43.4, హైదరాబాద్‌ 42, అనంతపురం 42, విజయవాడలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.