రామడుగులో బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌: జిల్లాలోని రామడుగు మండల కేంద్రంలో టీడీపీ, టీఆర్‌స్‌, బీజేపీ వామపక్షాల పార్టీల నాయకులు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. దుకాణ సముదాయాలను వ్యాపారస్తులు మూసివేశారు. ఈ సంధర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ విదానాల వల్ల దేశం నాశనం అవుతుందని ఈ యూపీఏ ప్రభుత్వం కొనసాగడానికి వీలులేదని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ పై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో టీడిపి నాయకులు గోపాల్‌గౌడ్‌, బీజేపీ నాయకులు తిరుపతిచారీ, గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.