రామడుగులో మలేరియాతో మహిళ మృతి

కరీంనగర్‌: రామడుగు మండల కేంద్రంలోని అమరగొండ ఉమ(45) మలేరియా జ్వరం సోకి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉమకు కరీంనగర్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించిన ఆరోగ్యం కుదుట పడలేదు. వైద్యులు జరిపిన పరిక్షల్లో ఉమకు మలేరియా సోకిందని ధృవికరించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆమె మరణించింది. రామడుగులోనే చెంగా సాయికృష్ణ, రాగం కనకలక్ష్మి, శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ డెంగీ జ్వరంతో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరారు.