రామలింగరాజును దోషిగా ప్రకటించిన నాపంల్లి కోర్టు…

అడ్వకేట్ రామచంద్రరావు…
సెక్షన్ 120 బి కింద.. 3 సంవత్సరాలు జైలు శిక్ష, 420 సెక్షన్.. చీటింగ్ కిందకు వస్తుంది.. కాబట్టి ఏడేళ్లు శిక్ష పడే అవకాశం వుంది. 409 సెక్షన్ ప్రకారం.. 10 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. అయితే.. రామలింగరాజు 36 నెలల జైలులో ఉన్నారు. ఆయన ఇప్పటివరకు జైలులో ఉన్న సమయాన్ని కట్ చేసి.. మిగిలిన సంసత్సరాలకు సంబంధించి శిక్ష పడే అవకాశం ఉంది.
తాడూరి శ్రీనివాస్ (హైకోర్టు అడ్వకేట్)…
సత్యం కంప్యూటర్ స్కాంలో తీర్పు హర్షణీయం. న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉంది అనడానికి ఈ తీర్పు నిదర్శనం. ఏ-1 నుంచి ఏ-10 నిందితులకు కూడా శిక్ష పడడం విశేషం. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ప్రొ.కె.నాగేశ్వర్…
సత్యం రామలింగరాజు లేని లాభాలు ఉన్నట్లుగా చూపించారు. కొత్త తరహా ఆర్థిక వ్యవస్థ.. రూపుదిద్దుకుంటుందనడానికి సత్యం కంప్యూటర్ స్కాం నిదర్శనం. ఏ కష్టం లేకుండా.. డబ్బులు సంపాదించాలని ఆలోచన… అత్యాశ కలగడంతో స్కాంల బారిన పడుతున్నారు. ఆదాయం లేకున్నా ఉన్నట్లు చూపించడం సరికాదు. సత్యం రామలింగరాజు ప్రజలను మోసం చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. తీర్పుల కన్నా.. వ్యవస్థలో మార్పు రావాలి.
ప్రొ.హరగోపాల్…
సత్యం రామలింగరాజుకు దోషిగా తేల్చి.. శిక్ష వేసినంత మాత్రన కార్పొరేట్ ఆగడాలు ఆగవు. వ్యవస్థలో మార్పు రావాలి.
తెలకపల్లి రవి(విశ్లేషకుడు)..
మోసాలకు పాల్పడుతున్న కార్పొరేట్ సంస్థలకు తీర్పు తీవ్రమైన గుణపాఠంగా తీసుకోవాలి. కార్పొరేట్ అనగానే అతి ఉన్నతమైంది అనడం భావ్యం కాదు. ఇలాంటి పద్ధతులను ప్రోత్సహించినవారికి గుణపాఠం లాంటిది. కార్పొరేట్ వ్యవస్థకు పారదర్శకత లేదు.
నన్నపనేని రాజకుమారి…టిడిపి నేత..
పారదర్శకత ఉండాలి. ఒత్తిడికి లోను కాకూడదు. తప్పులకు శిక్ష పడాల్సిందే. నిజాయితీ లోపించినప్పుడు… అవినీతికి పాల్పడిన వారికి శిక్షలు పడాల్సిందే. వ్యవస్థలో మార్పు రావాలి.. దోషులు నిర్ధోషులుగా, నిర్ధోషులు… దోషులుగా మారుతున్నారు. న్యాయవ్యవస్థలో మార్పు రావాలి. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు న్యాయాన్ని కాపాడాలి. వ్యక్తి కన్నా, వ్యవస్థ గొప్పది.
రామకృష్ణప్రసాద్(అడ్వకేట్)
తీర్పు హర్షణీయం. న్యాయవ్యవస్థను పరిపుష్టం చేయాలి.
అద్దంకి దయాకర్ (టీకాంగ్ అధికారి ప్రతినిధి)…
తీర్పు సంతోషకరం. ఆస్తి హక్కు ఉన్నప్పటికీ కూడా పరిధిని దాటి.. అక్రమంగా ఆస్తులను జమ చేస్తున్నారు.
కొనగళ్ల మహేష్ … టీ.కాంగ్రెస్
సత్యం కంప్యూటర్ స్కాం కేసులో రామలింగరాజును దోషిగా తేల్చిడం స్వాగతించాల్సిన విషయం. ఆలస్యంగానైనా… మంచి తీర్పు.. వెలువడింది. అవినీతికి పాల్పడితే… అంతిమంగా శిక్షపడుతుందని రుజువు అయింది.