రామానాయుడి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. రామానాయుడు శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచరికార్డు నెలకొల్పారని, చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌ తెచ్చేందుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని కేసీఆర్‌ పేర్కొన్నారు. రామానాయుడు మృతి యావత్‌ సినీ ప్రపంచానికి తీరనిలోటన్నారు. ఆయన కుటుంబసభ్యులకు కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.