రామాలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం

బెలంపల్లి పట్టణం: పట్టణంలోని రామాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిచే ఆలయ అధికారి వేణుగోపాల్‌ గుప్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఆలయ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఎన్‌.సత్యనారాయణతో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.