రామ్‌కు విజయేంద్రప్రసాద్ ప్రశంసలు
అమ్మాయి సినిమా అదుర్స్ అంటూ కితాబు
రామ్‌గోపాల్ వర్మ ప్రేరణతో ఎంతోమంది ఇండస్టీల్రో అడుగుపెట్టారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. ఆ మధ్యకాలంలో ఓ వేడుకలో ఆయన వేదికపై ఉండగానే ఆనాటి వర్మ కనిపించడం లేదు. విూకేమైనా కనిపిస్తే మళ్లీ అలాంటి సినిమా తీయమని చెప్పండి అని అన్నాను. అప్పుడు నాలోని ఆవేశం అలా అనేలా చేసింది. ఇప్పుడు చెబుతున్నా.. ’అమ్మాయి’ ట్రైలర్ చూశాక వర్మలో మళ్లీ ’శివ’ సినిమా నాటి డైరెక్టర్ కనిపించారు అని సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ’అమ్మాయి’ చిత్రం ప్రీరిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన విజయేందప్రసాద్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు.’శివ’ సినిమా చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. నాలాంటి వందల మంది రచయితలు, టెక్నీషియన్స్, ఆయన ప్రేరణతో సినిమాల్లో వచ్చారు. అమ్మాయి చూశాక గర్వంగా చెబుతున్నా. ’రాము గారూ.. విూలో ఆనాటి డైరెక్టర్ మళ్లీ కనిపించారు. శివ కంటే వందింతలు ఎక్కువగా కనిపించారు’. ఈ చిత్రం చైనాలో 40లకు పైగా స్క్రీన్స్‌లో విడుదల కావడం అద్భుతమైన విషయం. ఎవరూ సాధించని ఘనత ఇది. తెలుగు ఫిల్మ్ మేకర్స్ అందరికీ గర్వకారణం‘ అని అన్నారు. దీనికి వర్మ స్పందించారు. విూరన్న మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. నాకు వచ్చిన గొప్ప ప్రశంసలివి‘ అని వర్మ అన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూజా బాలేకర్ కీలక పాత్రలో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ’లడకీ’ చిత్రాన్ని తెలుగులో ’అమ్మాయి’గా విడుదల చేస్తున్నారు. ఈ నెల 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.