రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య అక్రమ రిజిస్ట్రేషన్

 

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య భూ అక్రమాల బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ మండలం నాగాన్ పల్లీ గ్రామానికి చెందిన శివమ్మ అనే వృద్ధురాలు బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించి తన పేరుపై ఉన్న భూమి పౌతీ మార్పిడికి పాల్పడ్డాడు తాహసిల్దార్ రాజయ్య. కరోనా సమయం లో శివమ్మ భర్త హన్మంతు రెడ్డి మృతి చెందాడు.అతనికి 198 వ సర్వే నంబర్ లో 27 ఎకరాల 34 గంటల భూమి ఉంది. దాంతో ఏప్రిల్ మాసంలో భర్త పేరుపై ఉన్న 27 ఎకరాల 34 గంటల భూమిని భర్త పేరుపై నుండి తన పేరుపై శివమ్మ రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఈ నెల 19 వ తేది న బ్రతికున్న శివమ్మ ను చనిపోయినట్లు రికార్డ్ సృష్టించారు. వృద్ధురాలు శివమ్మ చనిపోయిందని దరణిలో వెబ్ సైట్ లో మార్పులు చేర్పులు చేసి మరొకరు షేరి అంజమ్మ పై రిజిస్ట్రేషన్ చేసి సర్వే నంబర్ లో పట్ట భుమి కనబడకుండ తహసిల్దార్ సొంత తెలివి ప్రదర్శించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమానం తో తాహసిల్దర్ ను ఆరా తీసిన శివమ్మ తహసిల్దార్ పై జిల్లా కలెక్టర్ కు అలాగే రాయికోడ్ పోలీసులకు పిర్యాదు చేసిన రెండు గంటల వరకు హైడ్రామా కొనసాగించి రిసివర్ కాపీ ఇచ్చారు. తహసిల్దార్ పని తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవే కాదు ఎమ్మార్వో పై పలు ఆరోపణలు ఉన్నాయి అని స్థానిక ప్రజలు చెవులు కొరుకుంటున్నారు.