రాయితీలు ఎత్తివేసేందుకే నగదు బదిలీ పథకం: ఎంపీ నామా
ఢిల్లీ: రాయితీలు ఎత్తివేసేందుకే నగదు బదిలీ పథకమని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. నగదు బదిలీ పథకం వల్ల పేదలకు అందే రాయితీలన్నీ పోతాయన్న ఆయన గ్యాస్ సిలిండర్ల పరిమితిపై లోక్‌సభలో చర్చ జరపాలని నోటీసులు ఇచ్చినట్లు తెలియజేశారు.