సిద్దిపేటలో ఉద్రిక్తత

మెదక్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిద్దిపేటకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆమె కాన్వాయ్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు దీంతో మూడు వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు రంగ్రప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.