రావత్ అంటే మోడీకి అమితమైన నమ్మకం
మయన్మార్, బాలాకోట్ దాడులతో మార్మోగిన రావత్
పేరుధోవల్‌తో పాటు బాగా నమ్మే వ్యక్తిగా పేరు
న్యూఢల్లీి,డిసెంబర్9 (జనంసాక్షి) : హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ బిపిన్ రావత్ అంటే ప్రధాని మోడీకి ఎనలేని అభిమానం. అన్నింటికీ మించి అపారమైన నమ్మకం. ఆయన తన ఆంతరంగికుల్లో అజిత్ ధోవల్,బిపిన్ రావత్‌లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వీరిద్దరూ ఓ రకంగా దేశ సర్వసన్నాహక సత్తాను చాటేలా వ్యూహాలను అమలు చేస్తుంటారు. రావత్‌ను త్రివిధ దళాల అధిపతిగా చేయడం వెనక ప్రధాని మోడీకి ఉన్న అపారమైన నమ్మకం కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి. మోడీ ప్రధాని అయ్యాక ప్రధానంగా సరిహద్దుల్లో మన బలగాల్లో విశ్వాసం పెరిగింది. వారికి అనుక్షణం భరోసా నింపారు. దీపావళి వచ్చిందంటూ సైనికులతో గడిపి వారిలో ఈత్మస్థయిర్యం నింపడం మోడీ అలవాటు చేసుకున్నారు. అంతేగాకుండా సరిహద్దు భద్రతల విషయంలో రాజీలేని విధానం అవలంబిస్తూ వచ్చారు. చైనా సరిహద్దులతో పాటు,పాక్ తీరుపైనా నిరంతరం డేగకళ్లతో సైన్యం కాపాడుతూ వచ్చింది. ఇదంతా కూడా ప్రధాని మోడీ రావత్‌కు అప్పగించిన బాధ్యత. ఇవి అత్యంత సమర్థంగా రావత్ నిర్వర్తించడమే గాకుండా సైన్యంలో ఆత్మస్థయిర్యాన్ని నింపారు. ఇకపోతే ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్‌కు సైన్యంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. స్కూలింగ్ తర్వాత మరో ఆలోచన లేకుండా సైన్యంలోకి అడుగుపెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019లో పాకిస్థాన్‌పై జరిగిన సర్జికల్ స్టైక్స్, అంతకుముందు మయన్మార్‌లో జరిగిన సర్జికల్ స్టైక్స్‌క్రు కూడా బిపిన్ రావతే వ్యూహకర్త .2ఈ రెండు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీలోని ఓ రాజ్‌పుత్ కుటుంబంలో 1958లో జన్మించిన రావత్ ఇండియన్ ఆర్మీలో లెప్టినెంట్ జనరల్‌గా సేవలందించిన తన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ స్ఫూర్తిని నరనరానజీర్ణించుకున్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన బిపిన్ కూడా పాఠశాల స్థాయిలోనే డిఫెన్స్ అకాడవిూలో చేరారు. డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. ఆతర్వాత అమెరికాలోని కాన్సాస్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్సును పూర్తి చేశారు. ఆపై ఎంఫిల్, కంప్యూటర్‌లో డిప్లోమా, మిలిటరీ విూడియా అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌పై పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1978లో సెకండ్ లెప్టినెంట్గా గుర్జా రైఫిల్స్‌లో తన కెరీర్‌ను ఆరంభించారు బిపిన్ రావత్. అంతకు ముందు ఆయన తండ్రి కూడా ఇక్కడి నుంచే కెరీర్ ప్రారంభించడం విశేషం. ఆతర్వాత భారత సైన్యంలోని వివిధ విభాగాల్లో పలు కీలక బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు. 2017 జనవరి 1న బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2015లో బిపిన్ రావత్ ధింపూర్‌లో టైగర్ కోర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో 18 మంది భారత సైనికులను యూఎన్‌ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ మిలిటెంట్లు దారుణంగా హతమార్చి మయన్మార్ పారిపోయారు. దీంతో బిపిన్ రావత్ నాయకత్వంలోని భారత సైన్యం సరిహద్దులు దాటి మయన్మార్‌లోకి చొరబడిరది. భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న మిలిటెంట్లను మట్టుబెట్టింది. ఇక 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మందికి పైగా సైనికులు మరణించారు. అప్పుడు ఆర్మీ చీఫ్ హోదాలో ఉన్న బిపిన్ రావత్ మరోసారి సర్జికల్ స్టైక్స్‌న్రే ఆయుధంగా ఎంచుకున్నారు. పాక్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించిన మన సైనికులు అక్కడ తలదాచుకుంటోన్న జైషే మహ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇలా ఎన్నో ఆర్మీ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన బిపిన్‌రావత్ తన సైనికులకు ఎప్పుడూ ఓ ఐదు సూత్రాలు చెబుతూ వారిలో స్ఫూర్తి నింపేవారు. అవే.. దేశ కీర్తి ప్రతిష్టలు, నమ్మకం, లక్ష్యం, విశ్వాసం, దేశ గౌరవం. ఇక బిపిన్ రావత్ వర్క్ కమిట్‌మెంట్, ప్రొఫెషన లిజంపై ప్రధాని మోడీకి బాగా విశ్వాసం. అందుకే ఆయనను భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించారు. కాగా బిపిన్ రావత్ వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ పూర్వ విద్యార్థి కూడా. సరిగ్గా తాను చదువుకున్నచోట లెక్చరర్ ఇవ్వడానికి వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదం. ఇన్ని ఉన్నత లక్షణాలు కారణంగానే ఆయనంటే మోడీకి అమితమైనప్రేమ. అవే ఆయనను త్రివిధదళాధిపతని చేశాయి.