రావత్ మృతి దేశానికి తీరని లోటు: బండి
న్యూఢల్లీి,డిసెంబర్ 10 జనంసాక్షి : కామరాజ్ మార్గ్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ భౌతిక కాయానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నివాళులర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటన్నారు. అలాంటి వ్యక్తులు మళ్ళీ జన్మించాలని అన్నారు. తాను నమ్మే భాగ్యలక్ష్మి అమ్మవారిని బిపిన్ రావత్‌కి పునర్జన్మ ఇవ్వాలని కోరుకుంటున్నా అని బండి సంజయ్ తెలిపారు. మరోవైపు కామరాజ్ మార్గ్‌లో బిపిన్ రావత్ దంపతుల పార్థివ దేహాలకు కేంద్రమంత్రులు, ఎంపీలు, ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.