రావత్ హెలికాప్టర్ ప్రమాదంపైనే సర్వత్రా చర్చ
జవనాశ్వం లాంటి హెలికాప్టర్ కూలిపోవడంపై అనుమానాలు
బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో వెల్లడి కానున్న వాస్తవాలు
న్యూఢల్లీి,డిసెంబర్9 (జనంసాక్షి) : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన సిడిఎస్ చీఫ్ రావత్ మరణం దేశంయావత్తూ చర్చకు దారితీసింది. ప్రధానింగా సోషల్ విూడియాలో ఆయన మరణంపై తీవ్ర భావోద్వేగాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదంపై పలువురు తమకున్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత సైనిక హెలికాప్టర్ కుప్పకూలడంపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.దేశంలోనే అత్యంత కీలక సైనికాధికారి మరణానికి కారణమైన ఈ ప్రమాదం అనేక భావోద్వేగాలకు కారణమయ్యింది. రక్షణపరమైన అనుమానాలకూ దారి తీస్తోంది. గతంలో ఇలాంటి అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నా..ఈ ప్రమాదం వేరన్న భావనా కలుగుతోంది. అయితే ప్రమాద ఘటనపై తొందరపడి ఒక నిర్దారణకు రావడం సరైనది కాదు. అత్యున్నత స్థాయి వ్యక్తులు తమ ప్రయాణాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఏర్పడిరది. బ్లాక్‌బాక్స్ లభ్యమయ్యింది కనుక దీనిని విశ్లేషిస్తే కొంత సమాచారం రావచ్చు. దీనికితోడు అత్యున్నత విచారణకు ఆదేశించినందున అసలునిజాలు కూడా వెల్లడి కాగలవు. 2015లో నాగాలాండ్‌లో ఓ సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ టేకాఫ్ కాగానే 20 అడుగుల ఎత్తున ప్రమాదానికి గురైనప్పుడు రావత్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కానీ అదృష్టవశాత్తు ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. హోదా రీత్యా భారత సర్వసైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి కాగా, ఆ తర్వాతి స్థానం ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ది. దేశరక్షణ వ్యవహారాల్లో ప్రధానికీ, రక్షణ మంత్రికీ సీడీఎస్ కీలక సలహాదారు. అలాంటి అత్యున్నత స్థాయి వ్యక్తి దుర్మరణం దేశానికి కోలుకోలేని దెబ్బ. దట్టమైన చెట్లు, తేయాకుతోటలు నిండిన నీలగిరుల్లో, కూనూరుకు సవిూపంలో 5 నిమిషాల్లో గమ్యానికి చేరతారనగా ఈ ఘోర ప్రమాదం జరిగడం..అందులో ప్రయాణిస్తున్న వారంత మృత్యుముఖంలోకి చేరడం నిజంగా దిగ్భార్రతి కరమైన విషయం. నాలుగుస్టార్లు ధరించిన అరుదైన జనరల్‌గా ఎదిగిన 63 ఏళ్ళ రావత్ 1978 నుంచి ఇప్పటికి 43 ఏళ్ళుగా భారత సైన్యంలో విశేష సేవలందిస్తూ వచ్చారు. గతంలో ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించారు. కీలక ఘట్టాల్లో వీరోచిత సైనికుడిగా తన సత్తా చాటి, ఎన్నో గౌరవ పతకాలు అందుకు న్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో శాంతి పరిరక్షణ బాధ్యతలు, ఈశాన్యంలో తీవ్రవాద నిరోధక చర్యలు, సరిహద్దు ఆవల మయన్మార్ ఆపరేషన్లు, ఆ మధ్య సర్జికల్ దాడుల్లో రావత్ కీలక పాత్రధారిగా నిలిచారు. రిటైరయ్యే లోగా నెరవేర్చాల్సిన బృహత్తర బాధ్యత చాలా ఉందని సీడీఎస్‌గా చెబుతూ వచ్చారు. దేశ రక్షణకు కీలకమైన ఇంతటి వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇలా కూలిపోవడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. నాటి ప్రధాని ఇందిర తనయుడు సంజయ్ గాంధీ తను స్వయంగా నడుపుతున్న విమనా ప్రమాదంలో మృత్యువాతపపడ్డారు. కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా (2001 సెప్టెంబర్) విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. తెలుగువారైన లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి (2002 మార్చి), సమైక్య ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి (2009 సెప్టెంబర్), అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండూ (2011 మే) తదితరులు వివిధ హెలికాప్టర్ ప్రమాదాల్లో అకాల మరణం పాలయ్యారు. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిపై నేటికీ నివృత్తి కాలేదు. తాజాగా రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం అననుకూల వాతావరణమా లేక సాంకేతిక సమస్యా…లేక పైలట్ల అనుభవ రాహిత్యమా అన్న ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చగా మారయి. ఇవన్నీ విచారణలో నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. ఎయిర్ మార్షల్ స్థాయి ఉన్నతాధికారి సారథ్యంలో త్రివిధ దళాధికారులతో లోతైన విచారణ జరపనున్నట్టు సమాచారం. రష్యా నుంచి భారత సైన్యంలోకి వచ్చిన జవనాశ్వంగా పేరున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడమే అనుమానాలకు కారణం. నిజానికి, ఈ రష్యా తయారీ ఆర్మీ హెలికాప్టర్‌కు అత్యంత శక్తిమంత మైనదీ, సమర్థవంతమైనదని పేరు. దాని అత్యాధునిక సాంకేతికత, నలభైమందిని కూడా మోయగలిగే శక్తి, దట్టమైన మంచులోనూ, ఎడారి వేడిలోనూ, కఠినమైన ప్రతికూలవాతావరణంలోనూ ప్రయాణించగలిగే సమర్థత కలిగి ఉంది. ఆరువేలవిూటర్ల ఎత్తులోనూ ఐదువందల కిలోవిూటర్ల వరకూ నిర్విరామంగా ఎగరగలిగే సమర్థత దానిని వీవీఐపీలకోసం ప్రత్యేకంగా వినియోగించేందుకు వీలుకల్పిం చింది. రెండు ఇంజన్ల హెలికాప్టర్ సైతం ఇలా విఫలం కావడం వెనుక కారణాలేమిటో లోతైన దర్యాప్తు మాత్రమే వెలికితీయగలదు. ప్రముఖుల ప్రయాణాలకూ, కీలక రవాణాకూ చాలాకాలంగా నమ్మకమైన ఈ ఛాపర్లు ప్రమాదం పాలవడం ఆశ్చర్యమే. సీనియర్లు, అనుభవజ్ఞులైన పైలట్లే ఇలాంటి వీవీఐపీల హెలికాప్టర్లను నడుపుతారు. ప్రముఖుల ప్రయాణాలకు ముందు వాటిని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఆయిల్ మార్చడం మొదలు అనేక చిన్న విడిభాగాలను మార్చడం దాకా అనేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బుధవారం ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. కానీ, ఊహించని రీతిలో తక్కువ ఎత్తులో ఛాపర్ ప్రయాణి స్తోందనీ, ఓ భారీ వృక్షానికి గుద్దుకుందనీ, ఇంధన ట్యాంకు పేలి, కాలిపోయిందనీ కథనం. అంతా పైకి కనిపిస్తున్నట్టనిపించినా, బ్లాక్‌బాక్స్ విశ్లేషణ సహా లోతైన విచారణ తర్వాతే కారణాలు వెల్లడి కాగలవు. బ్లాక్ బాక్స్ విశ్లేషణలో కొన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.