రాశి సీడ్స్ తో అధిక దిగుబడి

ఉత్తమ రైతును సన్మానించిన రాశి సీడ్స్
దంతాలపల్లి అక్టోబర్ 9 జనం సాక్షి
రాశి పత్తి విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చని రాశి సీడ్స్ టెరిటరీ మేనేజర్ రాజు రెడ్డి అన్నారు.  రాశి సీడ్స్ వారి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన పత్తి రైతు జనిగల అశోక్  ను ఆదివారం తన వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్ సి హెచ్ 797 రకం పత్తి 120 రోజుల్లోనే పంట వస్తుందని అన్నారు.అదేవిధంగా ఎకరాకు 15 నుండి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు .ఆర్ సి హెచ్ 797 రకం పత్తి విత్తనాలు పత్తి పంటను తెగుళ్లు,గులాబీ రంగు పురుగును తట్టుకున్న శక్తి అధికంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతుబంధు గ్రామ కో ఆర్డినేటర్ నందారపు  రామచంద్రయ్య,గ్రామ మాజీ ఉపసర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న, వార్డు సభ్యులు బోడ పట్ల సతీష్, బొడ్లాడా పరిసర గ్రామాల రైతులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ లు బండారి శ్రీనివాస్, రామచందర్ లతోపాటు సుమారు 200 మంది రైతులు,విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area