రాష్ట్రంలో అవినీతికి కేంద్రం, సోనియా

బాధ్యత వహించాలి

తెదేపా నేత తుమ్మల

హైదరాబాద్‌ : రాష్ట్రంలో అవినీతికి కేంద్ర ప్రభుత్వం, సోనియా బాధ్యత వహించాలని తెదేపా నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి ద్వారా దోచుకున్న వేలకోట్ల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ హయాంలో అవినీతికి మూలకారకుడు కేవీపీ అని ఆరోపించారు. కేవీపీ బాగోతాల గురించి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎందుకు మాట్లాడదని ఆయన ప్రశ్నించారు.