రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్లు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, మరో 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయల సీమ జిల్లాల్లో నైరుతి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పారు.