రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్ష సూచన
హైదరాబాద్ : రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు భారీ వర్ష సూచనను జారీ చేసింది. రాగల 48 గంటల్లో రాష్ట్రంలో దక్షిణ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావారణ విభాగం తెలిపింది. మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడులో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశమున్నట్లు వెల్లడిరచింది. వాతావరణ విభాగం అధికారులు చెప్పారు. జార్ఖండ్‌పై అల్పపీడనం కొనసాగుతోందని… దీని ప్రభావంతో ఛత్తీస్‌గఢ్ , మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.