రాష్ట్రపతికి సతీవియోగం

1

– పలువురి నివాళులు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి):

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శుభ్రా ముఖర్జీ మంగళవారం ఉదయం 10.51గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి ప్రధాని సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. శుభ్రాముఖర్జీ 1940 సెప్టెంబరు 17న జెస్సోర్‌లో జన్మించారు. 1957 జులై 13న ప్రణబ్‌ ముఖర్జీతో శుభ్రా ముఖర్జీ వివాహం జరిగింది. శుభ్రా ముఖర్జీ రచయిత్రిగా, చిత్రకారిణిగా గుర్తింపు పొందారు. చొఖేర్‌ అలొయ్‌, చేనా అచెనాయ్‌ చిన్‌ పుస్తకాలను రచించారు. శుభ్రా ముఖర్జీ కుంచె నుంచి జాలువారిన చిత్రాలను పలుచోట్ల ప్రదర్శించారు. రవీంద్రనాథ్‌ సంగీతమంటే ఆమె  ఇష్టంగా పాడేవారు… గీతాంజలి ట్రూప్‌ పేరుతో ఓ సంగీత బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. శుభ్రా ముఖర్జీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ప్రణ్‌ ఒడిషా పర్యటనలో ఉండగా, ఆకస్మికంగా వర్తమానం రావడంతో ఆయన కార్యక్రమాలు రద్దు చేసుకుని డిల్లీ వెళ్లిపోయారు. సైనిక ఆస్పత్రిలో సుభ్ర ముఖర్జీకి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.ఆమె వయసు డెబ్భై ఏడు సంవత్సరాలు. శ్వాస కోశ వ్యాధితో ఆమె బాధపడుతూ మరణించారు. ప్రణబ్‌ కు సతీవియోగంపై ప్రధాని నరేంద్ర మోడీ , మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,   సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ నెల7 న ఆమెను ఆర్మీ ఆస్పత్రిలో చేర్చించారు. శుభ్రా మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ముఖర్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.