రాష్ట్రపతి అట్ హోంకు ప్రముఖుల హాజరు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీ ఎట్ ¬ం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హవిూద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పలువురు ఎంపీలు, అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. నిన్నటి వరకు పార్లమెంటు వేదికగా ఢీ అంటే ఢీ అన్న వివిధ పార్టీల నేతలు ఎట్ ¬ం కార్యక్రమంలో మాత్రం సరదాగా మాట్లాడుతూ కనిపించారు.