రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసి మహిళ కు అరుదైన అవకాశం-బిజెపి రాష్ట్ర నాయకులు యాప సీతయ్య

భారతీయ జనతా పార్టీ, ఎన్డిఏ అభ్యర్థిగా ఆదివాసి మహిళ  ద్రౌపది ముర్మ్ ను ప్రకటించడం గిరిజనుల అందరూ గర్వించదగ్గ విషయమని బిజెపి రాష్ట్ర నాయకులు యాప సీతయ్య తెలిపారు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతిని నిర్ణయించే అవకాశం వచ్చిన ప్రతిసారి ఒక ప్రత్యేకతను చాటుకుంది అని ఒకసారి  ముస్లిం అభ్యర్థిని మరొకసారి  దళిత అభ్యర్థిని ఇప్పుడు గిరిజన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా అందరికీ అవకాశం ఇవ్వడం ద్వారా రాజ్యాంగ విలువలను కాపాడిందని తెలియజేశారు. ఆదివాసి మహిళలు అభ్యర్థిగా ప్రకటించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డాకు పార్లమెంటరీ కమిటీ బోర్డ్ కు, ఎన్డీఏ నాయకులకు సీతయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిర్ణయం పట్ల దేశంలోని గిరిజనులు ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఈ నిర్ణయానికి కట్టుబడి గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. అత్యధికంగా గిరిజనులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు గిరిజనులకు అవకాశం ఇవ్వడానికి మద్దతు తెలపాలని ఆయన కోరారు.