రాష్ట్రపతి ఎన్నికల బాక్స్‌ తరలింపు

ప్రత్యేక భద్రత మధ్య ఢల్లీికి చేరవేత

హైదరాబాద్‌,జూలై19(జనం సాక్షి): రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్‌ బాక్సును అధికారులు ఢల్లీికి తరలించారు. దేశవ్యాప్తంగా సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికలు జరిగాయి. సీఎం కేసీఆర్‌ సహా దాదాపు నేతలంతా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఈ ఎన్నికల బ్యాలెట్‌ బాక్సును సాయంత్రం అసెంబ్లీలోని లాకర్‌ రూంలోనే జాగ్రత్త చేసిన అధికారులు.. తెల్లారగానే వాటిని ఢల్లీి తరలించారు. ఎన్నికల అధికారులు ఈ బాక్సును తీసుకొని ఢల్లీి బయలుదేరినట్లు తెలుస్తోంది. 16వ రాష్ట్రపతి ఎన్నికకు నిన్న జరిగిన పోలింగ్‌లో భాగంగా…. అసెంబ్లీలో 117మంది శాసన సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిశాక…. సాయంత్రం 5 గంటల తర్వాత ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సును సీల్‌ చేసి….. స్టోర్‌ రూంలో భద్రపరిచారు. తెల్లవారుజామున అసెంబ్లీ అధికారులు పటిష్ఠ భద్రత మధ్య శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దిల్లీకు తీసుకువెళ్లారు.

తాజావార్తలు