రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన నవాబ్స్ విద్యార్థులు
కరీంనగర్ : ఎడురానెట్ ఒలంపియాడ్ రాష్ట్రస్థాయి సైన్స్ అండ్ రిసోర్సు కాంపీటీషన్‌లో నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు సామియామనాల్ , సమీహాఅస్వద్, హుమేహని సలీం, హుదాపాతీమా ,అజ్రాపాతీమా , నిమ్రా తస్కిన్, జోహమహవిస్‌ఖాన్, తమికిన్ సిద్దిఖా, అక్సానూర్, సమీఉద్దిన్, అయేషా,వాజీద్‌అలీ, మెరాజ్ కౌనేన్ తదితర విద్యార్థులు మూడు బంగారు పతకాలు, మూడు వెండిపతకాలను మూడు అప్రిసీ పతకాలను సాథించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ ఫసీఉద్దిన్, మాట్లాడుతూ విద్యార్థులు అన్నిరంగాల్లో విజయాలు సాధించాలంటే సాధన ద్వారానే సాద్యమౌతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ మునవరొద్దిన్ ,ఉపాద్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గోని పతకాలు గెల్చుకున్న విద్యార్థులను అభినందించారు.