రాష్ట్రానికి అదనంగా వెయ్యి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం
-మంత్రి కొండ్రు
హైదరాబాద్ : ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా వెయ్యి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసెట్ వ్యవసాయ, వైద్య విద్య పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్‌ను ఆయన విడుదల చేసి మాట్లాడారు. వైద్య విద్య యాజమాన్య సీటను అన్‌లైన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు.