రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం
` ఆర్థిక వనరులను సమీకరిద్దాం
` తక్షణ కర్తవ్యాలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కలుసుకున్నారు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన రాజన్.. సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించిన రఘురాం రాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.ముందుగా తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్ ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలువాతో సత్కరించారు. భట్టి, శ్రీధర్ బాబుతో కలిసి బొకేతో రాజన్ ను స్వాగతించారు. అనంతరం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్లు సమాచారం. నిధుల సవిూకరణకు అనుసరించాల్సిన విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం, మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ రెడ్డితో రఘురామరాజన్ చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం సమావేశం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.కాగా 2023`24 చివరి నాటికి తెలంగాణ అప్పులు ఉూఆఖలో 23.8 శాతంగా ఉండనున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుకు రూ.1.29 లక్షల కోట్లు అవసరం అనేది అంచనా. 2023`24లో తెలంగాణ ప్రభుత్వం రూ.38,235 కోట్లు అప్పులు తెచ్చుకునే వీలు ఉండగా….ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ.33,378 కోట్ల మేర అప్పులు తెచ్చినట్లు రాష్ట్ర గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే తెలంగాణ రెవెన్యూ క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2023`24 బడ్జెట్ ప్రకారం రూ.2.16 లక్షల కోట్ల మేర రెవెన్యూ వస్తుందని అంచనా వేయగా…..ఇప్పటి దాకా వచ్చింది కేవలం లక్షల కోట్లు మాత్రమే. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలోనూ ఇప్పటికే రాష్ట్రానికి 50 శాతం వచ్చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నడపటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారింది. ఈ నేథ్యంలోనే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు సమాచారం. ఆరు గ్యారెంటీలు, ఇతర హావిూలతో పాటు అభివృద్ధి పనులకు, అవసరమైన నిధుల సవిూకరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవలంభించాల్సిన విధానాల గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ సిఎం రేవంత్‌కు సూచించినట్టుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురాం రాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నట్టుగా సమాచారం.
వరుసగా సవిూక్షలు, సమావేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది, కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే ఓ వైపు ఆర్థికపరమైన ఇబ్బందులు, మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవిూక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు, సహచర మంత్రులతో భేటీ అయి సమాలోచనలు చేస్తున్నారు. శాఖల వారీగా వివిధ అంశాలపై రేవంత్‌రెడ్డి అధికారులతో చర్చిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, రాష్ట్ర అభివృద్ధిపై సిఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇందుకు అవసరమైన నిధుల సవిూకరణపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సిఎం రేవంత్‌రెడ్డి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, సిఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.
తల్లీ జోగులాంబా.. దీవించు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనాలు అందించిన ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం వారి నివాసంలో కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రికి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం సమర్పించారు.